Adipurush: ఆదిపురుష్ మూవీ టార్గెట్ ఫిక్స్.. అన్ని రూ.కోట్ల కలెక్షన్లు సాధించాలా?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 7000కు పైగా థియేటర్లలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలిరోజే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ఆదిపురుష్ మూవీ టార్గెట్ 350 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ టార్గెట్ ను సాధిస్తే ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంటుంది.

ఆదిపురుష్ సినిమాపై నెలకొన్న అంచనాలకు ఈ టార్గెట్ మరీ భారీ టార్గెట్ అయితే కాదు. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆదిపురుష్ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరగగా ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆదిపురుష్ సినిమా మైథలాజికల్ సినిమాలు మరిన్ని తెరకెక్కేలా మార్గం చూపుతోంది. ఆదిపురుష్ సినిమాలో కృతిసనన్ సీత రోల్ లో సైఫ్ అలీ ఖాన్ రావణుని రోల్ లో నటిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ అంచనాలను మించి ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఆదిపురుష్ మూవీలో రాముని పాత్రతో ప్రభాస్ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. క్రిటిక్స్ ను మెప్పిస్తే మాత్రం ఆదిపురుష్ సృష్టించే రికార్డులు మామూలుగా ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ కు వార్ సీక్వెన్స్ లు హైలెట్ కానుండగా సెకండాఫ్ లో ఈ సీక్వెన్స్ లు రానున్నాయని తెలుస్తోంది. ఆదిపురుష్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఆశిద్దాం.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus