Adipurush: ఆదిపురుష్ తమిళ బుకింగ్స్ లెక్కల వెనుక వాస్తవాలివే!

ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదలవుతోంది. అయితే భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. అయితే ఆదిపురుష్ తమిళ్ వెర్షన్ బుకింగ్స్ మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా బుకింగ్స్ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నాయి. తమిళ వెర్షన్ బుకింగ్స్ చూసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

ఓవర్సీస్ లో ఆదిపురుష్ తమిళ వెర్షన్ టికెట్లు 50 కంటే తక్కువగా అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ తమిళ వెర్షన్ విషయంలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. యూఎస్ లో ఆదిపురుష్ మూవీ 1000 కంటే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ షోలలో తెలుగు షోలు 500 కంటే ఎక్కువగా ఉన్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఓవర్సీస్ లో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. తమిళనాడు రాష్ట్రంలో కేవలం 20 శాతం ఆదిపురుష్ టికెట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. తమిళ ప్రేక్షకులు ఇతర భాషలకు చెందిన హీరోల సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఈ మూవీ ద్వారా మరోసారి ప్రూవ్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ మూవీ రికార్డులు క్రియేట్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉండగా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆదిపురుష్ మూవీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ మూవీ ఓం రౌత్ కెరీర్ ను డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus