Adivi Sesh: కంటెంట్ ఉంటే స్టార్ ట్యాగ్ లు అవసరం లేదట..!

Advertisement

అడివి శేష్… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుల్లో ఎక్కువ లీడ్ రోల్స్ పోషిస్తూ తనలోని వైవిధ్యాన్ని బయటపెడుతున్నాడు. శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’ జూన్ 3న విడుదల కాబోతుంది.ముంబై దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ ప్రమోషన్స్‌ ఓ రేంజ్లో జరుగుతున్నాయి.

శేష్ కూడా తన సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ట్విట్టర్‌లో కూడా ఇటీవల అభిమానులతో ముచ్చటించాడు శేష్.ఈ సందర్భంగా ఓ నెటిజెన్ ఇతన్ని ‘శేష్ అన్నా మిమ్మల్ని థ్రిల్లింగ్ స్టార్ ట్యాగ్ తో పిలిస్తే హ్యాపీ గా ఫీలవుతారా? అంటూ ప్రయాణించాడు. ఇందుకు శేష్…. ‘కటౌట్ ఉన్నప్పుడు టైటిల్ అవసరం లే. కంటెంట్ ఉన్నప్పుడు కటౌట్ అవసరం లే . ‘మేజర్‌’ ను చూసినప్పుడు మీకు అర్ధమవుతుంది’ అంటూ కామెంట్ చేశాడు.

ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. శేష్ చిత్రాల్లో బలమైన కంటెంట్ ఉంటుంది కాబట్టి మిగిలిన హీరోల సినిమాల్లో ఉండదు అన్నట్టు కొంతమంది వీటిని వక్రీకరిస్తున్నారు. తెలుగు సినిమాల్లో దాదాపు ప్రతి హీరోకి ఓ స్టార్ ట్యాగ్ ఉంటుంది. ఇటీవల అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ స్టార్ ట్యాగ్ ను కట్టబెట్టాడు దర్శకుడు సుకుమార్.

శేష్ కామెంట్స్ టాలీవుడ్లో ఉన్న ఇలాంటి స్టార్ హీరోలను వెక్కిరించినట్టు ఉందని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. శేష్ మాత్రం తన ‘మేజర్’ చిత్రం పై ఉన్న బలమైన నమ్మకంతోనే ఇలాంటి కామెంట్లు చేసినట్టు అభిప్రాయపడుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus