Adivi Sesh, Ravi Teja: అడివి శేష్ వెనక్కి తగ్గుతాడా..?

టాలెంటెడ్ హీరో అడివి ప్రస్తుతం ‘మేజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్, జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి. 2008లో జరిగిన ముంబై ఎటాక్స్ లో మృతి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చిన అడివి శేష్.. రీసెంట్ గానే షూటింగ్ మొదలుపెట్టాడు.

దాదాపు షూటింగ్ చివరిదశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే సమయానికి రవితేజ తన ‘ఖిలాడి’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 11న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు రవితేజ. దీంతో అడివి శేష్ సినిమా చిక్కుల్లో పడింది. మార్కెట్ పరంగా చూసుకుంటే రవితేజ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. పైగా మాస్ ఆడియన్స్ కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.

అందుకే అతడికి పోటీగా తన సినిమాను విడుదల చేయడానికి ఆలోచనలో పడ్డాడు అడివి శేష్. కానీ ఈ రెండు సినిమాను డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించినవి కాబట్టి శేష్ రిస్క్ తీసుకొని మాస్ మహారాజాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తాడేమో చూడాలి!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus