Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

ఈ క్రిస్మస్ కి ‘ఛాంపియన్'(Champion) అనే సినిమా రిలీజ్ కాబోతోంది. దీని ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఫిదా అయ్యేలా చేసింది. చిన్న సినిమాగా ‘ఛాంపియన్’ భారీ పోటీలో నిలబడుతున్నట్టు అంతా చెప్పుకుంటున్నారు. కానీ ఈ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

Champion

శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్ళిసందD’ తో ఓ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. సాధారణంగా అలాంటి హిట్ వచ్చిన తర్వాత ఏ హీరో అయినా వరుసగా సినిమాలు చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ రోషన్ మాత్రం కొంత గ్యాప్ తీసుకుని ‘ఛాంపియన్’ స్క్రిప్ట్ ను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 4 ఏళ్ళు కష్టపడ్డాడు. మేకోవర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్లో అతని కష్టం కనిపించింది. కచ్చితంగా ఈ సినిమా అతని కోసం చూడాలని చాలా మంది ఫిక్స్ అయ్యారు.

హీరోయిన్ అనశ్వర రాజన్ ‘గిర్ర గిర్ర గింగిరానివే’ పాటలో తన అభినయంతో ఆకట్టుకుంది. ఈమెకు ఫాలోయింగ్ కూడా మొదలైపోయింది. ఈమె నటన కోసం కూడా ‘ఛాంపియన్’ ని థియేటర్లలో చూడాల్సిందే.

దర్శకుడు ప్రదీప్ అద్వైతం ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ ని ఎంత బాగా తీశాడో చూశాం. కచ్చితంగా పొటెన్షియాలిటీ ఉన్న దర్శకుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. తన డెబ్యూ మూవీకి ఇంత పెద్ద ప్రాజెక్టుని టేకప్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ట్రైలర్లో ఇతని పనితనం కనిపిస్తుంది. ఇతని పనితనం కోసం ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాని మొదటి రోజు చూసే అవకాశం ఉంది.

మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి 2 పాటలు వచ్చాయి. అవి రెండూ చార్ట్ బస్టర్స్ అనిపించుకున్నాయి.ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయ్యింది. కాబట్టి.. సినిమాకి ఇతని మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ప్రియాంక దత్,జికె మోహన్, జెమినీ కిరణ్..వంటి బడా నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని రూ.47 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ట్రైలర్లోని విజువల్స్ చూస్తుంటే రూ.100 కోట్ల సినిమాలోని విజువల్స్ లా అనిపించాయి. సో టెక్నికల్ టీమ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు అని అర్ధం చేసుకోవచ్చు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కోసం కూడా ఛాంపియన్ ని కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.

బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus