Meera Jasmine: 10 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ.. వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన ఒకప్పటి హీరోయిన్!

కొద్దిరోజులుగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది మీరా జాస్మిన్. గతంలో లేని విధంగా ఈమె బాగా స్లిమ్ అయ్యి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొనడంతో.. ఈమె రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది అని అంతా అంచనా వేశారు. ‘అమ్మాయే బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్… అటు తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గుడుంబా శంకర్’ తో బాగా పాపులర్ అయ్యింది.

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి పాత్రల్లో ఈమె (Meera Jasmine) ఎక్కువగా కనిపించేది. ఈ క్రమంలో ఆమె చేసిన ‘భద్ర’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘పందెం కోడి’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘గోరింటాకు’… వంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అయితే ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘మహారధి’ వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈమె త్వరగానే ఫేడౌట్ అయిపోయింది.

2014 లో దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే త్వరలో ‘విమానం’ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది మీరా జాస్మిన్. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. మీరా జాస్మిన్ మాట్లాడుతూ.. “నేను మీ మీరా జాస్మిన్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నేను ‘విమానం’ సినిమా చేయడానికి కారణం ఏంటంటే.. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్.

ఈ కథ విన్న తర్వాత ఇక దేని గురించి ఆలోచించలేదు. ఈ స్టోరీ, క్యారెక్టర్స్ మాత్రమే మైండ్లో ఉండేవి. ‘నాకు తెలీదు.. నేను ‘విమానం’ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నానా.. లేక ‘విమానం’ చిత్రం నన్ను ఎంపిక చేసుకుందా అనేది’..! ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఫీల్ అయ్యింది మీరు కూడా ఫీలవ్వాలి అంటే ‘విమానం’ సినిమా చూడండి” అంటూ చెప్పుకొచ్చింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus