20 ఏళ్ళ తర్వాత విజయ్ కి జోడీగా నటించనున్న జ్యోతిక

  • August 18, 2023 / 06:12 AM IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పటికీ పలు వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూర్య భార్యగా ఈమె బాగా ఫేమస్. 20 ఏళ్ల క్రితం ఈమె ఓ స్టార్ హీరోయిన్. కోలీవుడ్ , టాలీవుడ్లో రూపొందిన పెద్ద సినిమాల్లో నటించింది. తెలుగులో ఈమె చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ .. ‘మాస్’ .. ‘షాక్’ వంటి సినిమాల్లో నటించింది. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ లో కూడా ఈమెదే మెయిన్ రోల్.

ఆ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. కాబట్టి.. జ్యోతికని ఇప్పటికీ తెలుగు నటిగానే ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. జ్యోతిక ఇప్పటికీ తమిళంలో, మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. అయితే తిరిగి మళ్ళీ ఇప్పుడు ఓ స్టార్ హీరో సరసన నటించబోతుంది. టైటిల్ చూసిన వాళ్లకి ఆ విషయం ఈజీగానే అర్థమైపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఈమె గతంలో రెండు సినిమాల్లో నటించింది.

అందులో ఒకటి ‘ఖుషి’ కాగా మరొకటి ‘తిరుమలై’. ఈ రెండు సినిమాలు కూడా అక్కడ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ‘తిరుమలై’ చిత్రం 2003 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పుడు అంటే 20 ఏళ్ళ తర్వాత విజయ్ – జ్యోతిక కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. వివరాల్లోకి వెళితే.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా జ్యోతిక ఎంపికైనట్టు తెలుస్తుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus