Chiranjeevi: చిరంజీవి సరసన మాజీ స్టార్‌ ‘హీరో’యిన్‌.. నిజమేనా?

Advertisement

‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి (Chiranjeevi) – విజయశాంతిని (Vijayashanti) చూసి నిన్నటి తరం సినిమా అభిమానులు కడుపు నిండిపోయింది అని చెప్పాలి. ఆ కాంబోను అలా టీవీ స్క్రీన్‌, యూట్యూబ్‌లోలో చూడగానే వావ్‌ అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరూ కలసి చేసిన సినిమాలు, అవి సాధించిన విజయాలు అలాంటివి మరి. 30 ఏళ్ల క్రితం ఈ జోడీ ఇచ్చిన హిట్లు ఇండస్ట్రీని షేక్‌ చేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలసి నటిస్తున్నారా?

చిరంజీవి – విజయశాంతి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్‌లోనే చిరంజీవే చెప్పారు. ఆయనేదో కాస్త నవ్వుతూ అన్నారు కానీ… సమ్‌థింగ్‌ హ్యాపెన్డ్‌ అని అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ఇద్దరూ కలసి నటించాలని అనుకుంటున్నారట. ఈ మేరకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు అని టాక్‌. చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాలో ఓ సీనియర్‌ హీరోయిన్‌ పాత్ర ఉందని… దాని కోసం విజయశాంతిని సంప్రదించారని టాక్‌. విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయడం లేదు. అయితే చిరంజీవి అడిగాడు కదా అని.. మొహమాటానికి ఒప్పేసుకునే రకం కాదు విజయశాంతి. దీంతో ఆ సినిమాలో నటించటానికి ఆమె ఇంట్రెస్ట్‌ చూపిస్తుందా అనేదే ఇక్కడ ప్రశ్న. ఒకవేళ ఆమె ఓకే అంటే మరపురాని కాంబోను మరోసారి చూసినట్లు అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి మాజీ నాయిక త్రిషను (Trisha) ఓ హీరోయిన్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో ఐదుగురు యువ నాయికలు కూడా నటిస్తున్నారట.

ఇక చిరంజీవి, విజయశాంతి ఇప్పటివరకు 19 సినిమాల్లో నటించారు. ‘పసివాడి ప్రాణం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘గ్యాంగ్‌ లీడర్’ (Gangleader), ‘కొండవీటి రాజా’, ‘కొండవీటి దొంగ’, ‘స్వయం కృషి’(Swayam Krushi) … ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అన్నీ ఇండస్ట్రీ హిట్‌లు కొట్టినవే. మరిప్పుడు మళ్లీ కలసి నటిస్తే ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus