Rajasekhar: ‘లవ్ స్టోరీ’ కి పోటీగా ‘ఆర్జీవీ దెయ్యం’.. సైలెంట్ గా కెలుకుతున్నాడుగా..!

Advertisement

2014లో డా.రాజ‌శేఖ‌ర్‌ హీరోగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా మొదలైంది. ఆ చిత్రం పేరు ‘పట్ట పగలు’. బాలీవుడ్ మూవీ ‘బ్రేకప్’లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఈ చిత్రంలో రాజశేఖర్ కు కూతురి పాత్రలో కనిపించనుంది. గతేడాది ‘బిగ్ బాస్4’ లో కూడా ఈమె ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  తెలుగులో కూడా ఈమె అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘జంప్ జిలానీ’ వంటి సినిమాల్లో నటించినందుకు గాను ఈమెకు ‘బిగ్ బాస్’ లో ఛాన్స్ దక్కింది.

ఇదిలా ఉండగా.. ‘పట్ట పగలు’ ని ‘ఆర్జీవీ దెయ్యం’ గా టైటిల్ మార్చేసి.. ఏప్రిల్ 16న అదీ శేఖర్ కమ్ముల- నాగ చైతన్య ల ‘లవ్ స్టోరీ’ సినిమాకి పోటీగా దింపుతున్నాడు వర్మ. సైలెంట్ గా ఉన్న వాళ్లను ఏదో ఒక రకంగా గిల్లడం వర్మకు అలవాటే..! ఈసారి కూడా అదే చేస్తున్నాడు. అయితే నాగ చైతన్యను,శేఖర్ కమ్ములను కాదు. మన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ను సైలెంట్ గా కెలుకుతున్నాడు. అదెలా అంటారా… ఈ చిత్రం కథ రాజ శేఖర్ కు చెప్పిన విధానం ఒకటి.. తీసిన విధానం ఒకటి.

దాంతో వర్మతో గొడవ పడి ఈ సినిమాని ఆపేసాడట రాజ శేఖర్. అయితే ఇప్పుడు సైలెంట్ గా పేరు మార్చి విడుదల చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ చిత్రం గురించి వర్మ మాట్లాడుతూ.. ” ‘ఆర్జీవీ దెయ్యం’ సినిమా వెండి తెర ప్రమోషన్స్ మొదలు పెట్టాము. ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురుకు తండ్రిగా రాజశేఖర్ నటించడమే కాక, రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో నటిస్తుండటం విశేషం” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus