Boney Kapoor: మమ్ముట్టి ‘వన్’.. రీమేక్ రైట్స్ కొన్న బోనీకపూర్!

  • June 29, 2021 / 01:06 PM IST

బాలీవుడ్ లో నిర్మాతగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు బోనీకపూర్. ఒకానొక సమయంలో ఆయన తీసే సినిమాలన్నీ ప్లాప్ లు అవుతుండడంతో నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రీమేక్ కథలతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బోనీకపూర్ తాజాగా మరో రీమేక్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘వన్’ అనే సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంతోష్ విశ్వనాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది. ఇటీవల ఈ సినిమా రీమేక్ హక్కులను బోనీకపూర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో నిర్మిచాలనేది బోనీకపూర్ ప్లాన్. ఇందులో అనీల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. పొలిటిక డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ ఆడియన్స్ కు తగ్గట్లుగా ఈ కథలో మార్పులు చేయబోతున్నారు.

ప్రస్తుతం బోనీకపూర్.. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తమిళంలో ‘ఆర్టికల్ 15’ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. అలానే అజిత్ నటిస్తోన్న ‘వాలిమై’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో బోనీకపూర్ రేంజ్ పెరగడం ఖాయమంటున్నారు!

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus