నవీన్ పోలిశెట్టికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya). ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించగా స్వరూప్ ఆర్.జె.ఎస్ దర్శకత్వం వహించారు. ఇందులో డిటెక్టివ్ రోల్లో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కనిపించాడు. అతని డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అన్నీ కూడా ఆడియన్స్ ని కట్టిపడేశాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ తర్వాత నవీన్ పోలిశెట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం అతను వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ‘జాతి రత్నాలు’ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో అతని స్థాయి పెరిగింది. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. నవీన్ పోలిశెట్టికి మంచి బ్రేక్ ఇచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందనుందట. స్వరూప్ ఆర్.జె.ఎస్ ఆల్రెడీ బేసిక్ ఐడియాని నవీన్ కి అలాగే నిర్మాత రాహుల్ యాదవ్ కి చెప్పడం జరిగిందట. ఇద్దరికీ ఆ ఐడియా బాగా నచ్చిందట. వెంటనే వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ప్రస్తుతం స్వరూప్ ఈ క్రేజీ సీక్వెల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట. దీని పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ‘బ్రహ్మ ఆనందం’ సినిమాతో నిర్మాత రాహుల్ యాదవ్, ‘మిషన్ ఇంపాజిబల్’ సినిమాతో స్వరూప్ ప్లాపులు ఇచ్చారు. ఈ సీక్వెల్ తో మళ్ళీ ఫామ్లోకి వస్తారేమో చూడాలి.