Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

దిల్ రాజు (Dil Raju) – నితిన్ (Nithiin) కాంబినేషన్ ‘తమ్ముడు’ సినిమా రూపొందింది. ఈ శుక్రవారం అంటే జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నితిన్- దిల్ రాజు (Dil Raju) ఓ చిన్న చిట్ చాట్లో పాల్గొన్నారు. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ‘దిల్’ టైటిల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Dil Raju

‘ఆది’ రిలీజ్ అయిన తర్వాత వినాయక్ కి అడ్వాన్స్ ఇచ్చి ‘దిల్’ స్క్రిప్ట్ పై వర్క్ చేయడం మొదలుపెట్టాం. ఆ టైంలో నేను, వినాయక్ బేగంపేట్ సైడ్ వెళ్తున్నాం. అక్కడ నీ ‘జయం’ సినిమా పోస్టర్స్ కనిపించాయి. అవి వినయ్ చూసి ‘ఈ కుర్రాడు ఎవరో బాగున్నాడు అన్నా’ అని నాతో అన్నాడు. ‘ఇతను మా సుధాకర్ రెడ్డి కొడుకే’ అని నేను అన్నాను. వెంటనే వినయ్.. ‘అయితే నీ సినిమాలోకి తోసేద్దామా?’ అని అన్నాడు.

వెంటనే నేను సుధాకర్ రెడ్డికి ఫోన్ చేసి అడిగాను. అలా నువ్వు ‘దిల్’ ప్రాజెక్టులోకి వచ్చావ్” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ‘ఆ తర్వాత ‘దిల్’ తో మీ పేరు దిల్ రాజు అయ్యింది. ఆ టైటిల్ మీది కాబట్టి వాడుకుంటున్నారా? లేక నేను, వినాయక్ గారు మీకు ఇచ్చాము అనుకోవాలా?’ అంటూ నితిన్ ప్రశ్నించాడు. “చెప్పాలంటే అది జనాలు నాకు పెట్టిన పేరు అది.

వాస్తవానికి ఆ టైటిల్ మొదట మనది కాదు. నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ గారు రిజిస్టర్ చేయించి పెట్టుకుంటే.. నేను వెళ్లి అడిగాను. ఆయన మనకు ఇచ్చారు. ” అంటూ దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ గారు గతంలో ‘ప్రేమంటే ఇదేరా’ ‘యువరాజు’ వంటి పెద్ద సినిమాలు నిర్మించారు.

నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus