War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో ‘వార్ 2’ (War2) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘వార్’ సూపర్ హిట్ అవ్వడంతో ‘వార్ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ ఎంటర్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. టి.సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 14న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ వదిలారు.

War2

దానికి అనుకున్న స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఎన్టీఆర్ ని మెయిన్ హైలెట్ గా టీజర్ కట్ చేస్తే బాగుండేది. కానీ మధ్యలో హృతిక్ రోషన్, కియారా అద్వానీ షాట్స్ పెట్టడం మైనస్ అయ్యింది. అందువల్ల ఇక్కడ అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి.. భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అందుకే టి – సిరీస్ సంస్థ తెలుగు థియేట్రికల్ రైట్స్ రూపంలో భాగంగా రూ.100 కోట్లు డిమాండ్ చేస్తుందట. దీంతో తెలుగులో బయ్యర్స్ ఈ చిత్రాన్ని అంత భారీ బడ్జెట్ పెట్టి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ‘సితార..’ నాగవంశీ మాత్రం ఎన్టీఆర్ కోసం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేయాలని ప్రయత్నించాడు. రూ.70 కోట్లకు తెలుగు థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేయాలని నాగవంశీ ప్రయత్నించారట.

ఈ క్రమంలో ఫైనల్ గా రూ.80 కోట్లకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. నాగవంశీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసినా.. అది దిల్ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తాడనే సంగతి తెలిసిందే. అయితే ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్ల వరకు రికవరీ చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus