భారీ రికార్డ్స్ ని బద్దలు కొడితే వచ్చే కిక్కే వేరప్పా…. అనుకున్నారేమో పవన్, త్రివిక్రమ్.. వారిద్దరూ కలిసి ఇది వరకు ఉన్న రికార్డ్స్ ని అధిగమించారు. వీరి కలయికలో తాజాగా రూపుదిద్దుకుంటున్న మూవీ అజ్ఞాతవాసి. ఈ చిత్రం ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనిలోకి దిగింది. జనవరి 10 న రిలీజ్ కావడానికి నిర్మాత రాధా కృష్ణ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా ఫస్ట్ కాపీ రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయినట్లు సమాచారం. ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడే థియేటర్స్ ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రదర్శించనున్నారు.
అమెరికాలో ఈ రిలీజ్ రికార్డ్ సృష్టించబోతుంది. ఎలాగంటే .. ఈ చిత్రం అమెరికాలో 209 లోకేషన్స్‌లో రిలీజవుబోతున్నట్లుగా ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ చిత్రం అన్ని భాషలు కలిపి 126 లోకేషన్స్‌లో విడుదలై రికార్డ్‌ని క్రియేట్ చేసింది. బాహుబలి 2 తర్వాత స్థానంలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం 74 లోకేషన్స్, “కబాలి” చిత్రం 73 లోకేషన్స్, “దంగల్” చిత్రం 69 లోకేషన్స్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్రాలను దాటుకొని 209 లోకేషన్స్‌లో విడుదలవుతూ ‘అజ్ఞాతవాసి’ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. కలక్షన్స్ పరంగా ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.