అజ్ఞాతవాసి మూవీ థియేట్రికల్ ట్రైలర్ | పవన్ కళ్యాణ్ | కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్

జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ సినిమాలతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లే.. ఇటీవల విడుదలైన ‘అజ్ఞాతవాసి’ టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్స్ నమోదు చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబతోంది.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags