తన 20 ఏళ్ల సినిమా కెరీర్ గురించి ఐశ్వర్య కామెంట్

Advertisement

సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ వంటి హీరోలతో ప్రేమాయణం సాగించిన బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్… ఫైనల్ గా అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని బిగ్ బి ఇంటి కోడలిగా సెటిలైపోయింది. బిగ్ బి తనయుడిని ప్రేమించి పెళ్లాడిన ఈ మాజీ ప్రపంచ సుందరి… తల్లి అయిన తరువాత కొన్నేళ్ల పాటు నటనకు గుడ్ బై కూడా చెప్పేసింది. ఇక రీసెంట్ గా మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా దొరక్కపోవడం గమనార్హం. అయితే.. త్వరలోనే అనురాగ కశ్యప్ దర్శకత్వంలో తన భర్తతో కలిసి నటించనుంది ఐశ్వర్య. పెళ్లి తర్వాత దాదాపు ఎనిమిదేళ్ళ విరామం అనంతరం అభిషేక్-ఐశ్వర్య కలిసి నటించనున్న ఈ చిత్రంపై సినిమా ప్రారంభానికి ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ జీవిత కథతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి మిస్ వరల్డ్ గా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన క్రమం, అభిషేక్ తో పెళ్లి.. దానికి ముందు పలు వివాదాలు, హీరోలతో ఎఫైర్లు ఇలా ఒక సినిమాకు కావాల్సినంత స్టఫ్ ఆమె జీవితంలో ఉంది. దీంతో ఐశ్వర్య బయోపిక్ తీస్తే హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఆ దిశగా పనులు ప్రారంభించారు. ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య.. ‘నా జీవిత కథతో సినిమా రూపొందాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న అన్ని కోణాలు ప్రజలకు తెలియాలి. ఏది దాచాలని అనుకోవడం లేదు. ఇదొక గొప్ప కథ అవుతుంది’ అని వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus