‘ఆర్ఎక్స్100’ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా అతడికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దీని తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి ‘మహాసముద్రం’ అనే సినిమాను తీశారు. శర్వానంద్, సిద్ధార్థ్ లు కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో అజయ్ భూపతి కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
పక్కా రగ్డ్, రస్టిక్ సినిమాను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేయబోతున్నారు. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. పక్కా హీరో, విలన్ అని కాకుండా అన్నీ కీలకంగా ఉండే రెండు డజన్ల పాత్రలు ఉంటాయి. ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దాదాపు 80 రోజుల షూటింగ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు.
అందులో ముప్పై రోజులు నైట్ వర్కింగ్ డేస్ తో కాస్త భారీగానే చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాలో కేవలం తెలుగు నటులు మాత్రమే కాకుండా బాలీవుడ్ తో సహా ఇతర భాషల నటులు కూడా ఉంటారని సమాచారం. దాన్ని బట్టి ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తారేమో అనిపిస్తుంది.
అయితే ఎవరెవరు నటించబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి ‘మహాసముద్రం’ ఇచ్చిన డిస్సపాయింట్మెంట్ నుంచి కోలుకొని మరో ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నారు అజయ్ భూపతి. ఈసారైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!