గతేడాది జులై నెలలోనే రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతోంది. అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీకి ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే అవకాశాలు తక్కువేనని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అజయ్ దేవగణ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అజయ్ పాత్ర సినిమాకే మెయిన్ హైలెట్ అయ్యే విధంగా ఉండనుందని సమాచారం.
సినిమాలో అజయ్ దేవవణ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో వస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజును సరైన మార్గంలో నడిపించే గురువు పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించనున్నారు. రాజమౌళి అజయ్ దేవగణ్ పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని సమాచారం. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయి రేటుకు అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.
బాహుబలి, బాహుబలి2 సినిమాలతో తెలుగు సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కాకపోతే మాత్రం వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారితే ఆ ప్రభావం ఇతర సినిమాలపై కూడా పడే అవకాశం ఉంది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!