Ajay Devgn, RRR Movie: అయ్యో.. అజయ్ దేవగణ్ పాత్ర నిడివి అంత తక్కువా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరగాలనే ఆలోచనతో ఈ సినిమాలోని కీలక పాత్రకు అజయ్ దేవగణ్ ను జక్కన్న ఎంపిక చేశారు. అజయ్ దేవగణ్ పోస్టర్లు అంచనాలు పెంచడంతో అజయ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగణ్ పాత్ర నిడివి కేవలం 8 నిమిషాలే అని తెలుస్తోంది.

ఈ విషయం తెలిసి అజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి కొందరు మాత్రం ఈ ప్రచారంలో నిజం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ పాత్ర కేవలం 30 నిమిషాలు మాత్రమేనని ప్రచారం జరిగిందని ఆ ప్రచారంలో నిజం లేదని రాజమౌళి స్పష్టతనిచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ కొంత సమయమే కనిపిస్తారనే వార్త నిజమో కాదో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజయ్యే వరకు ఆగాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి కొంత సమయం చూపించినా ప్రతి పాత్రను అద్భుతంగా చూపిస్తారనే సంగతి తెలిసిందే. దుబాయ్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దానయ్య భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. జక్కన్న సైతం ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus