నాలుగు బూతులుంటే ట్రైలర్ హిట్ అవుతుందనుకుంటున్నారా ?

  • April 2, 2019 / 01:12 PM IST

ఒక సినిమా ట్రైలర్ లేదా టీజర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏముంటుంది? సినిమాలో కంటెంట్ ఏమిటి? ఏ తరహా ఆడియన్స్ ఈ సినిమాకి రావొచ్చు, సినిమాలో ప్రత్యేక ఆకర్షణలు ఏమిటి అనేది జనాలకి తెలియడం కోసం ట్రైలర్లను విడుదల చేస్తారు. ఒక్కోసారి ట్రైలర్ బాగుంటే.. సినిమా బాగోకపోవచ్చు, కొన్నిసార్లు ట్రైలర్ తో సంబంధం లేకుండా సినిమా బాగుండొచ్చు. కానీ.. ఈమధ్యకాలంలో ట్రైలర్స్ ని కేవలం జనాల్ని మోసం చేయడానికి మాత్రమే వాడుతున్నారు. ఈమధ్యకాలంలో ట్రైలర్స్ లో కంటెంట్ కంటే కిస్సులు, బూతులు ఎక్కువైపోతున్నాయి. యూట్యూబ్ లో కూడా వాటికి గట్టిగానే వ్యూస్ వస్తుండడంతో కొత్త దర్శకులందరూ తమ సినిమాల ట్రైలర్లో కనీసం ఒక లిప్ లాక్, ఓ నాలుగైదు బూతులు ఉండేలా చూసుకుంటున్నారు.

తాజాగా విడుదలైన “స్పెషల్” అనే సినిమా ట్రైలర్ ఇందుకు ఉదాహరణ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ట్రైలర్ లో అనవసరంగా ఇరికించిన అమ్మనాబూతులు మాత్రం చిరాగ్గా ఉన్నాయి. మరి ఈ బూతులు అనేవి ఉండడం వల్ల సినిమాకి జనాలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారని అనుకుంటున్నారో లేక మరింకేదైనా కారణం ఉందో దర్శకులకే తెలియాలి. బూతులు అనేది సినిమాలకి కొత్తేమీ కాదు. రాజమౌళి సినిమాల్లోనే బూతులు ఉండేవి.. కాకపోతే ఆ బూతు వెనుక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండేది. ఇప్పటి సినిమాల్లో ఆ ఎమోషన్ లోపించింది. ఇప్పుడు బూతులు మాత్రమే ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus