కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారనే సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణ వల్ల పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతూ ఉండటంతో ఆకలితో అలమటించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అనాథలు, నిరుపేదలు, బిచ్చగాళ్లు లాక్ డౌన్ రూల్స్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఆకలితో అలమటిస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని అజిత్ అభిమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అజిత్ అభిమానులు రోడ్డు పక్కన బండ్లను ఏర్పాటు చేసి ఆ బండ్ల ద్వారా పేద ప్రజలకు అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, ఆహార్ పొట్లాలను అందజేస్తూ వినూత్నంగా సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆకలేస్తే వచ్చి ఆ ఆహార పొట్లాలను తీసుకొని వెళ్లాలంటూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అజిత్ ఫ్యాన్స్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా అజిత్ అభిమానులలా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కరోనా కష్ట కాలంలో సేవా దృక్పథంతో, ఉదార స్వభావంతో అభిమానులు సాయం చేస్తే హీరోలకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా తమ వంతు సహాయం చేస్తుండటం గమనార్హం. కొందరు సెలబ్రిటీలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందిస్తుంటే మరి కొందరు సెలబ్రిటీలు బెడ్ల ఖాళీలు, మందులకు సంబంధించిన సమాచారం ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!