టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ మూవీగా ‘జాట్’ వచ్చింది. ఏప్రిల్ 10 న రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటివరకు దాదాపు రూ.50 నెట్ కలెక్షన్స్ ను సాధించింది ఈ సినిమా. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ,అజయ్ ఘోష్ వంటి టాలీవుడ్ స్టార్లు చాలా మంది నటించారు.
ఇక తాజాగా ‘జాట్’ చిత్ర బృందం వివాదంలో చిక్కుకుంది.దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’, హీరో సన్నీ డియోల్, విలన్ గా చేసిన రణదీప్ హుడా..ల పై భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం.
క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమాలో సన్నివేశం ఉందని, యేసు క్రీస్తును అవమానిస్తూ ఈ సన్నివేశం తీశారని, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు ఉన్న ఈ పవిత్ర మాసంలో ఇలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాని రిలీజ్ చేసినందుకు గాను ‘జాట్’ యూనిట్ పై కేసు నమోదైనట్లు స్పష్టమవుతుంది. ‘జాట్’ సినిమా సెకండాఫ్ లో ఓ చర్చ్ సీన్ ఉంటుంది.
అక్కడ విలన్ రణదీప్ హుడా యేసు ప్రభు సిలువపై వెటకారంగా చేతులు పెట్టి.. ఆ తర్వాత చర్చ్ లో ఉన్న జనాలను తుపాకులతో కాల్చి చంపేస్తూ ఉంటాడు. ఈ సీన్ కొంచెం హింసాత్మకంగా ఉంటుంది. మరి ఈ కేసు నుండి ‘జాట్’ యూనిట్ ఎలా బయటపడుతుందో చూడాలి.