Ajith: హాట్ టాపిక్ అయిన అజిత్ రిస్కీ షాట్ వీడియో.!

  • April 5, 2024 / 04:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మొన్నామధ్య ఓ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పారు. అందులో భాగంగా చిరు మాట్లాడుతూ.. ” ‘తిరుగులేని మనిషి’ సినిమా షూటింగ్లో నేను ఎన్టీఆర్ గారు ఓ యాక్షన్ సీన్లో పాల్గొన్నాను. అప్పుడు మేము 4 అడుగుల ఎత్తు నుండి కిందకి దూకాల్సి ఉంది. అప్పుడు అత్యుత్సాహంలో నేను దూకేశాను. కానీ ఎన్టీఆర్ గారు దూకలేదు. ఆ టైంలో ఆయన మాట్లాడుతూ.. ‘బ్రదర్.. మనం అలా దూకకూడదు. డూప్ దూకుతారు.

మనం దూకినప్పుడు పొరపాటున మనకి ఏమైనా జరిగితే షూటింగ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. నిర్మాతకి భారీగా నష్టాలు వస్తాయి’ అని ఆయన చెప్పారు. ఆయన చెప్పింది నిజం. ఆ తర్వాత ఒకసారి నేను అలాంటి షాట్ చేసినప్పుడు గాయపడ్డాను. షూటింగ్ చాలా రోజులు ఆగిపోయింది. నిర్మాతకి నష్టం వచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి నుండి యాక్షన్ సీన్స్ లో జాగ్రత్త పడుతున్నట్టు చిరు చెప్పుకొచ్చారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) తన నెక్స్ట్ సినిమా ‘విదా ముయార్చి’ కోసం ఓ రిస్కీ షాట్ చేశాడు. ఇలాంటి రిస్కీ షాట్స్ ఉంటే అతనే చేసేస్తానని ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు ఈ స్టార్ హీరో. గతంలో ‘వివేగం’ (Vivegam) ‘వలీమై’ సినిమాల్లో కూడా ఇలాంటి రిస్కీ షాట్లు ఎక్కువగా చేశాడు. గతంలో ఇతనికి సర్జరీ కూడా అయ్యింది. అయినా ఇతను తగ్గడు.

లేటెస్ట్ గా అజిత్ చేసిన రిస్కీ వీడియో చూస్తే అభిమానులు కూడా కంగారు పడేలా ఉంది. ఒకవేళ అతనికి ఏమైనా అయితే షూటింగ్ డిలే అవుతుంది. అప్పుడు నిర్మాతకి కోట్లల్లో నష్టాలు వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అందుకే అజిత్ కూడా చిరుని ఫాలో అయితే చాలా బెటర్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus