Ajith: ఫ్యాన్ వార్స్ పై అజిత్ రియాక్షన్!

ఫ్యాన్ వార్స్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో ఈ ఫ్యాన్ వార్స్ ఓ రేంజ్ లో జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యస్గ్ ట్యాగ్స్ పెట్టి అవతలి హీరోని కించపరుస్తూ పోస్ట్ లు పెట్టడం, దారుణమైన కామెంట్స్.. మీమ్స్ డిజైన్ చేసి పెడుతుంటారు. తమిళంలో విజయ్, అజిత్ అభిమానుల మధ్య తరచూ ఈ గొడవలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ఈ ఫ్యాన్ వార్స్ మరింత ఎక్కువయ్యాయి.

కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చూస్తుంటే మరీ ఇంత దిగజారుడు అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్ మొదలైంది. ఈ ఇద్దరు హీరోలు నటించిన ‘వరిసు’, ‘తునివు’ సినిమాలు ఒకేసారి రిలీజ్ కు సిద్ధమవుతుండడంతో అభిమానుల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. సంక్రాంతికి విజయ్ సినిమాదే హవా అని అతడి అభిమానులు అంటుంటే.. తమ హీరోదే పైచేయి అని అజిత్ ఫ్యాన్స్ అంటున్నారు.

విడుదలకు మరో రెండు నెలలు ఉండగానే ఫ్యాన్స్ వార్స్ పీక్స్ కు చేరుకున్నాయి. ఇక రిలీజ్ సమయానికి ఈ గొడవలు ఏ రేంజ్ లో చేరుకుంటాయో అనే భయాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో అజిత్ ఫ్యాన్ వార్స్ ను ఉద్దేశిస్తూ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ‘మనం బ్రతుకుదాం.. అవతలి వాళ్లను బ్రతికిద్దాం.. డ్రామా వద్దు, నెగెటివిటీ వద్దు..

మీ చుట్టూ ప్రోత్సహించే వారినే పెట్టుకోండి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి దిశగా ప్రేరణ పొందండి. అసూయ వద్దు.. ద్వేషం వద్దు’ అంటూ సూచించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న గొడవల నేపథ్యంలోనే అజిత్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడనేది స్పష్టమవుతోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus