Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా, గాడ్‌ ఫాదర్‌లు లేకుండా కెరీర్‌ను సుదీర్ఘకాలం కొనసాగించడం అంటే చాలా పెద్ద విషయం. అలాంటి పని చేసి, స్టార్‌ హీరో అయ్యి ఎందరికో ఆదర్శంగా నిలిచారు ప్రముఖ హీరో అజిత్‌కుమార్‌. ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్లు అయిన సందర్భంగా అజిత్‌ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన జర్నీ ఏమంత సులభంగా సాగలేదని, ఇన్నేళ్ల నట ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనట్లు ఆ నోట్‌లో రాసుకొచ్చారు. తనను ఇన్నేళ్లు ప్రేమించిన, ఆదరించిన అభిమానులకు రుణపడి ఉంటానని కూడా రాసుకొచ్చాడు.

Ajith

సినిమా అనే కష్టమైన ఇండస్ట్రీలో 33 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఈ సందర్భంగా మీతో ఎన్నో విషయాలు పంచుకోవాలని ఉంది. గడిచిన ప్రతి సంవత్సరం నాకో మైలురాయి. మరిన్ని మైలురాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను. మీరు చూపించే ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడంలేదు. నా ప్రయాణం ఏనాడూ సులభంగా సాగలేదు. జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు నన్ను పరీక్షించాయి. ఎప్పుడూ ఆగిపోలేదు. ఎదుర్కొంటూనే ముందుకు సాగాను. అన్నింటినీ భరించి పడిలేచిన కెరటంలా ఉత్సాహంతో పని చేస్తున్నాను. పట్టుదలే నేను నమ్ముకున్న మార్గం, అదే నా బలం అని రాసుకొచ్చాడు అజిత్‌.

ఈ నట ప్రయాణంలో ఊహించలేనన్ని పరాజయాలు చూశాను. ఆ కారణంగా ముందుకుసాగలేనని అనుకున్న ప్రతిసారీ మీ ప్రేమే నన్ను ప్రోత్సహించింది. నా దగ్గర ఏమీ లేనప్పుడు, వరుస వైఫల్యాలు ఎదురైనప్పుడూ మీరు నా వెంటే ఉన్నారు. ఇలాంటి గొప్ప అభిమానులు దొరకడం నా అదృష్టం. మోటారు రేసింగ్‌లోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. శారీరకంగా గాయాలయ్యాయి. అక్కడ నేను ఎదగకుండా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఈ క్రమంలో అవమానించారు, పరీక్షలు పెట్టారు. కానీ నేను పతకాలు సాధించే స్థాయికి ఎదిగాను. ధైర్యంగా ముందడుగేస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించాను తన బలం ఏంటో చెప్పాడు అజిత్‌.

నా భార్య షాలిని లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అభిమాను ప్రేమను నేను ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు. అందరిలా ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు, మీతో తరచుగా మాట్లాడుతూ ఉండకపోవచ్చు. 33 ఏళ్లుగా మీరు నన్ను, నాలోని లోపాలను కూడా అంగీకరించారు. మీతో ఎప్పటికీ నిజాయతిగా ఉండడానికి ప్రయత్నిస్తాను. రేసింగ్‌లోనూ మన దేశం గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags