నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘అఖండ 2’ (డిసెంబర్ 5) పై అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. మొదటి భాగం ‘అఘోరా’ మేనియా, ఇప్పుడు సీక్వెల్‌కు కల్ట్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తానికి హక్కులను సొంతం చేసుకున్నారు.
Akhanda 2
‘అఖండ 1’ సాధించిన విజయం, పాన్ ఇండియా రిలీజ్ స్ట్రాటజీనే ఈ రేంజ్ బిజినెస్‌కు కారణంగా కనిపిస్తోంది. లేటెస్ట్ ట్రేడ్ సమాచారం ప్రకారం, ‘అఖండ 2’ ఓవర్సీస్, నార్త్ అమెరికా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మోక్షా మూవీస్, సినీగెలాక్సీ దక్కించుకున్నాయి. ఈ డీల్ విలువ ఏకంగా 15 కోట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే ఓవర్సీస్ మార్కెట్‌లో అతిపెద్ద డీల్స్‌లో ఒకటి. ఈ డీల్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
డీల్ 15 కోట్లు అయినా, అసలైన సవాల్ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమా నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 2.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.21 కోట్లు) వసూలు చేయాల్సి ఉంటుంది.. 2.5M డాలర్స్ అనేది సాధారణంగా ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి టాప్ టైర్-1 హీరోల సినిమాలకు పెట్టే టార్గెట్. ‘అఖండ 1’ యూఎస్‌లో కల్ట్ హిట్ అయినా, ఆ రేంజ్ వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు సీక్వెల్‌కు ఏకంగా ఆ మార్కును టార్గెట్‌గా పెట్టడం అతిపెద్ద ‘రిస్క్’ అని ట్రేడ్ అంటోంది.
అయితే, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ‘అఖండ’ రీకాల్ వాల్యూ, బోయపాటి మాస్ ఎలివేషన్స్, పాన్ ఇండియా రిలీజ్ స్ట్రాటజీని బలంగా నమ్ముతున్నారు. బాలయ్య ‘లార్జర్ దెన్ లైఫ్’ ఇమేజ్, అఘోరా పాత్రకు యూఎస్‌లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని, మొదటి భాగాన్ని మించి ఈ సీక్వెల్ ఆడుతుందని వారు ధీమాగా ఉన్నారు. ఇది బాలయ్య స్టామినాకు, బోయపాటి కంటెంట్‌కు అతిపెద్ద అగ్నిపరీక్షగా మారింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.