నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం విడుదలై 3 వారాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంచి కలెక్షన్లను నమోదు చేస్తూనే ఉంది. గతవారం ‘పుష్ప’ వంటి మరో పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ ‘అఖండ’ జోరు తగ్గలేదు. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 3 వారాల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం | 19.06 cr |
సీడెడ్ | 14.49 cr |
ఉత్తరాంధ్ర | 5.95 cr |
ఈస్ట్ | 4.00 cr |
వెస్ట్ | 3.65 cr |
గుంటూరు | 4.55 cr |
కృష్ణా | 3.46 cr |
నెల్లూరు | 2.51 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 57.67 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 10.06 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 67.73 cr |
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 21 రోజులకి గాను రూ.67.73 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.13.73 కోట్ల లాభాలు దక్కాయి. మరి 4 వారంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే క్రేజీ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ‘అఖండ’ కి ఎన్ని థియేటర్లు మిగుల్తాయో చూడాలి.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!