Akhanda Collections: రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ జాతరే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ‘సింహా’ ‘లెజెండ్’ కాంబో కావడంతో ఈ సినిమా పై మొదటి నుండీ భారీ అంచనాలు నమోదయ్యాయి.మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్లు నమోదయ్యాయి.రెండో రోజు కూడా ఈ చిత్రం సూపర్ కలెక్షన్లను నమోదు చేసింది.

2 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 6.70 cr
సీడెడ్ 5.25 cr
ఉత్తరాంధ్ర 2.04 cr
ఈస్ట్ 1.48 cr
వెస్ట్ 1.27 cr
గుంటూరు 2.28 cr
కృష్ణా 1.24 cr
నెల్లూరు 1.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 21.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 5.00 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 26.43 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.26.43 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజు కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసి ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది.అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.27.57 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. శని,ఆది వారాల్లో ఈ చిత్రం భారీగా రాబడితే 70శాతం పైనే రికవరీ సాధించే అవకాశం ఉంటుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus