Akhanda Movie: అక్కడ ‘అఖండ’ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా..!

  • January 28, 2022 / 09:53 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. 2021 డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘సింహా’ ‘లెజెండ్’ లను మించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 50రోజుల వరకు ‘అఖండ’ కలెక్షన్లు తగ్గలేదు అంటే.. ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్ధం చేసుకోవచ్చు.

రూ.54 కోట్లకి ఈ చిత్రాన్ని బయ్యర్స్ కొనుగోలు చేయగా ఫుల్ రన్లో రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ‘అఖండ’ డిజిటల్ రిలీజ్ కాగా ఇక్కడ కూడా రికార్డు వ్యూయర్ షిప్ ను సాధించి ఇక్కడ కూడా ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘అఖండ’ ని తమిళంలో విడుదల చేయబోతున్నారు. జనవరి 28న ‘అఖండ’ తమిళ్ వెర్షన్ విడుదల కానుంది.

అక్కడ ఈ చిత్రాన్ని రూ.0.60కోట్లకి కొనుగోలు చేసారు. కాబట్టి ఫుల్ రన్లో అక్కడ ఈ చిత్రం రూ.0.75కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.తెలుగులో సూపర్ హిట్ అవ్వడంతో అక్కడి బయ్యర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేశారు. లేదంటే ఎక్కువ శాతం తెలుగు సినిమాల్ని అక్కడ అడ్వాన్స్ బేసిస్ పైనే విడుదల చేస్తుంటారు. మరి ఈ ఊర మాస్ ఎంటర్టైనర్ తమిళ ప్రేక్షకుల్ని ఏ మేరకి అలరించి అక్కడ వసూళ్ళని రాబడుతుందో చూడాలి..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus