అఖిల్- సురేంద్ర రెడ్డి ల.. ప్రాజెక్టుకి కూడా ముహూర్తం ఫిక్స్..!

Advertisement

అక్కినేని మూడో తరం హీరో అఖిల్.. స్టార్ హీరోగా ఎదగడానికి చాలా కష్టపడుతున్నాడు. తాను నటించిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయినప్పటికీ.. తరువాత ప్రాజెక్టుల విషయంలో మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో అఖిల్ కు తిరుగులేదు. అయితే నటుడుగా ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ ఇంకా అఖిల్ కు పడలేదు.అయితే ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయట.

బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం పూర్తయ్యాక సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా అఖిల్ ఓ ప్రెజెక్టు సెట్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్టు ఉంటుందని కూడా ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ వారు ఇటీవల ప్రకటించారు. కానీ దానికి ముందు పవన్ 3 సినిమాలు కంప్లీట్ చెయ్యాల్సి ఉంది.

దీంతో అఖిల్ తో సినిమా చెయ్యడానికి సురేందర్ రెడ్డి ఓ ‘స్పై థ్రిల్లర్’ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడట. ‘ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారని సమాచారం. 45 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట నిర్మాత అనిల్ సుంకర. సెప్టెంబర్ 9వ తారీఖున ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని.. టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ రెండు చిత్రాలు కనుక హిట్ అయితే అఖిల్ స్టార్ హీరో అయిపోవడం కన్ఫర్మ్ అనే చెప్పాలి..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus