‘అఖిల్’….కేవలం టైటిల్ కే ఫిదా అయిపోయాడా?

వినేవాడు వాడు ఉండాలే కానీ ఎన్నైనా చెప్తారు ఈ రాజకీయ నాయకులు అని చాలా మంది అంటూ ఉంటారు. మరి పొలిటికల్ లీడర్స్ కు తామేమీ తక్కువ కాదు అనుకున్నడో ఏమో కానీ, అఖిల్ మరీ పొలిటికల్ లీడర్ లాగానే మాట్లాడుతున్నాడు. అసలు విషయం ఏమిటంటే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పడేసావే’ సినిమాకు మొదటి నుంచి అక్కినేని ఫ్యామిలీ అండ ఉంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని చునియా అనే లేడీ డైరక్టర్ తెరకెక్కిస్తుంది. ఈమె అన్నపూర్ణా స్టూడియోస్ లో క్రియేటివ్ ఇన్ చార్జ్ గా పనిచేసింది.

అందుకే ఈ సినిమా ప్రమోషన్ భారాన్ని అక్కినేని కుటుంబం తమ నెత్తిన వేసుకుంది. ఇప్పటికే టాలీవుడ్ మన్మధుడు నాగ్ ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటే, తాజాగా అఖిల్ సైతం చేతికి కట్టు కట్టుకుని మరీ సినిమాను ప్రమోట్ చేసే పని పెట్టుకున్నాడు. ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తము ఫ్యామిలీకి.. తమ అన్నపూర్ణ స్టూడియోస్ కు చునియా ఎంతో దగ్గరైన వ్యక్తి అని, ఈ సినిమాను అందరూ చూసి ఆమెను బ్లెస్ చేయాలని అఖిల్ కోరాడు. ఇక అదే క్రమంలో కాస్త ఆవేశంగా…ఈ సినిమాకు తనకు చాలా దగ్గర కనెక్షన్ ఉంది అని చెప్పాడు, అదేమిటంటే…ఈ సినిమా టైటిల్ ”పడేశావే”..

అలాగే అఖిల్ డెబ్యూ సినిమాలో ‘పడేశావే పడేశావే’ అంటూ థమన్ బాబు కంపోజ్ చేసిన సాంగ్ ఒకటి ఉంది. అందుకే అఖిల్ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయాడట. ఇలా కూడా కనెక్ట్ అయిపోతారా అంటే అయిపోతారనే చెప్పాలి మరి. ఇక  ఈ సినిమా రిసల్ట్ ఏమవుతుందో ఈ శుక్రవారం తేలనుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus