కథలు ఎపిక విషయాల నుండీ… సినిమా పూర్తయ్యాక కూడా రీ షూట్లు చేయమని డైరెక్టర్లను పదే పదే ఇబ్బంది పెడతారని చాలా గతంలో చాలా వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరిద్దరి కెరియర్ ను నాగార్జున పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. చైతూను క్లాస్ హీరోగా .. అఖిల్ ను మాస్ హీరోగా నిలబెట్టాలనే దిశగా నాగ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్లలో భాగంగా అఖిల్ కు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి అఖిల్ స్పందిస్తూ…”ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అటు అన్నయ్య చైతూ కు .. ఇటు నాకు మొదటి సినిమా సమయంలో నాన్న వెంటే ఉండటం వలన అలా ప్రచారం జరిగిందేమో. నిజానికి ఆయన మా కెరియర్ ను కంట్రోల్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. తనవంతుగా సలహాలు .. సూచనలు ఇస్తుంటారు. ప్రస్తుతం ఆయన మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసారు. ఒకవేళ మాకే కథ విన్నప్పుడు డౌట్ గా అనిపిస్తే.. మేమే నాన్నకు చెప్తూ ఉంటాము.. అప్పుడు ఆయనకి తోచిన సలహాలు అయన ఇస్తుంటారు… కానీ ఫైనల్ డెసిషన్ మాకే వదిలేస్తారు అంతే..!” అంటూ అఖిల్ క్లారిటీ ఇచ్చాడు..