Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్4: స్క్రిప్ట్‌ అయితే ఓకే… కానీ ప్రతిసారి అభినే ఎందుకు?

బిగ్‌బాస్4: స్క్రిప్ట్‌ అయితే ఓకే… కానీ ప్రతిసారి అభినే ఎందుకు?

  • October 13, 2020 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్4: స్క్రిప్ట్‌ అయితే ఓకే… కానీ ప్రతిసారి అభినే ఎందుకు?

బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రేమలు, గొడవలు, అలకలు, కోపాలు సహజం. అయితే అవి ఎక్కువ రోజులు ఉండవు అంటుంటారు. ఈ రోజు స్నేహితులు, రేపు శత్రువులైనా… ఆ తర్వాతి రోజు కలసిపోతుంటారు. కానీ నాలుగో సీజన్‌ బిగ్‌బాస్‌లో ఇది కనిపించడం లేదు. జన్మజన్మల శత్రుత్వం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి మీద అభిమానమో, ఇంకొకరి మీద కోపంగా మారుతోంది. దాంతో అదే పనిగా నామినేషన్‌ చేస్తూ పోతున్నారు. ఇంట్లో అలాంటి ఒక వైరం అఖిల్‌ – అభిజీద్‌ది.

ఇంటికి వచ్చిన తొలి వారం నుంచి అభిజీత్‌, అఖిల్‌ మధ్య సరైన సఖ్యత లేదు. పిలుచుకోవడాలు దగ్గర మొదలైన మాట, మాట ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి అఖిల్‌ – మోనాల్‌ – అభిజీత్‌ ట్రయాంగిల్‌ స్టోరీ అదనం. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా అభిజీత్‌ ఫెయిల్‌ అయ్యాడంటూ అఖిల్‌ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దానికి ముందే నామినేషన్‌ సమయంలో మోనాల్‌ పేరెత్తి అఖిల్‌… విషయాన్ని సీరియస్‌ చేశాడు. అభిజీత్‌ ఎంతగా వద్దని చెబుతున్నా వినిపించుకోలేదు.

‘రా’ అనే పిలుపుతో అభిజీత్‌ – అఖిల్‌ మధ్య మంట పుట్టింది. తనను ఎవరైనా కొత్త వ్యక్తి, బయటవాళ్లు అలా పిలిస్తే నచ్చదు అంటూ అభిజీత్‌ అన్నాడు. దానికి అఖిల్‌ తప్పుగా తీసుకున్నాడు. తర్వాత క్యాజువల్‌గా అభిజీత్‌ ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌ గురించి మాట్లాడితే… ఆ విషయంలో పక్కనున్నవాళ్లు చెప్పిన మాటలు విని అఖిల్… కోపం పెంచుకున్నాడు. ఆ కోపం చాలా రోజులు నడిచింది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా పక్కపక్కన కనిపించి ఒకటి రెండుసార్లు అనే విషయం తెలిసిందే.

ఇద్దరి మధ్య నిప్పురాజుతున్న సమయంలో ఆజ్యం పోసినట్లుగా ఉక్కు హృదయం టాస్క్‌ వచ్చింది. అందులో స్మార్ట్‌ గేమ్‌ ఆడి అందరి మనసులు గెలుచుకున్న అభిజీత్‌… అఖిల్‌కు మాత్రం ఎప్పటిలాగే నచ్చలేదు. ఆ టాస్క్‌ విషయంలో నాగార్జున సైతం అభిజీత్‌ను పొగిడాడు. మొన్న జరిగిన బిబి గ్రాండ్‌ హోటల్‌ టాస్క్‌లో అభిజీత్, అఖిల్‌ ఒకే టీమ్‌లో ఉన్నా… అదేదో వేరే టీమ్‌ అయినట్లు అఖిల్‌ తన గేమ్‌ తాను ఆడుకున్నాడు. దీంతో అత్యధికంగా టిప్స్‌ సంపాదించాడు కానీ… టీమ్‌ గెలవడానికి ఏమీ చేయలేకపోయాడు.

Bigg Boss Telugu 4 Abijeet vs Monal vs Akhil 1

ఇక నామినేషన్‌ సమయంలో మోనాల్‌ టాపిక్‌ను తీసుకొచ్చి రచ్చ చేసిన విషయం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తన గురించి లేక తనకు సంబంధించిన విషయాల గురించి కారణం చెప్పి నామినేట్‌ చేయాలి. లేదంటే వాదించాలి. కానీ అఖిల్‌ మోనాల్‌ టాపిక్‌ తెచ్చాడు. అయితే అది అభిజీత్‌ మీద కోపానికే అని అర్థమవుతోంది. ఇక సోమవారం జరిగిన నామినేషన్‌లోనూ అదే పరిస్థితి. సంచాలక్‌గా నువ్వు సరిగ్గా పని చేయలేదు అంటూ అభిజీత్‌ మీద ఆరోపణలు చేశాడు. టాస్క్‌ సమయంలో ఓ వ్యక్తి చేతులు కాళ్లకు తగిలాయి.. అది ఫౌల్‌. నువ్వు చూడలేదు అని అఖిల్‌ అన్నాడు. అయితే అదెవరో చెప్పడం లేదు.

ఇలా ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడటం, అభిజీత్‌ మీద కోపం పెంచుకోవడం వెనుక కారణాలేంటో అఖిలే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే ఇద్దరి మధ్య మాట యుద్ధం పెరిగేటట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ సమయంలో ఫిజికల్‌ టాస్క్‌ పడితే… విషయం ఇంకా హీట్‌ ఎక్కుతుందనిపిస్తోంది. అయితే ఇదంతా బిగ్‌బాస్‌ స్క్రిప్ట్‌లో భాగమే అనేవాళ్లూ లేకపోలేదు. ఒకవేళ స్క్రిప్టే అనుకుందాం… అయితే ప్రతిసారి అభిజీత్‌నే ఎందుకు తప్పు చేసినవాడిగా చూపించాలి అనేది ఓ ప్రశ్న. బిగ్‌బాస్‌ ఈ ప్రశ్నకు ఈ వారమైనా సమాధానం చెబుతారేమో చూడాలి.

ఈవిషయాన్ని నాగార్జున సీరియస్ గా మందలించినా కూడా ఇద్దరికీ ఎక్కలేదు. సో, ఈవారం ఖచ్చితంగా ఇద్దరూ రెచ్చిపోతారనే అనుకుంటున్నా.. అభిజిత్ ఈ విషయంలో కూల్ గా ఉన్నా, అఖిల్ మాత్రం ఫుల్ గా ఫైర్ లో ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుందా అని వెయిట్ చేస్తున్నాడు.

ఈ సారి టాస్క్ లో ఇద్దరికీ గట్టిగా పడితే మాత్రం ఎవరూ తగ్గరు.. ఇద్దరిమద్యలో పెద్ద గొడవ కూడా అవుతుంది. ఒకవేళ ఇద్దరూ కూల్ అయినా కూడా బిగ్ బాస్ స్క్రిప్ట్ వర్క్ దగ్గరుండి మరీ ఇద్దరికీ గొడవపెట్టేలాగానే కనిపిస్తున్నాడు. నిజంగా ఇది స్క్రిప్ట్ తోనే గనక షో నడిస్తే.., ఈ గొడవ అనేది ఖాయం. అలాకాకుండా వాళ్లే స్వతహాగా ఎమోషన్ కి గురి అయితే ఎలా రియాక్ట్ అవుతారు అనేది చెప్పలేం..  ఇద్దరి మద్యలో గొడవ ముదురుతోందనే అనిపిస్తోంది. మరి ఏ విషయంలో ఈగొడవ జరుగుంది .. అలాంటి టాస్క్ బిగ్ బాస్ ఏదైనా డిజైన్ చేస్తాడా లేదా అనేది చూడాలి. మరిన్ని బిగ్ బాస్ ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ కోసం..

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

40 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version