Akira: ‘ఓజీ’ చూశాక అకీరా ఫస్ట్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

టైటిట్‌ చూసి.. తండ్రి సినిమా చూశాక కొడుకు రియాక్షన్‌ ఎలా ఉంటుంది? అయినా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ అందుకున్న సినిమా విషయంలో కొడుకు రియాక్షన్‌ ఎలా ఉంటుంది.. అదిరిపోయింది అనే అంటాడు కదా అని అనుకుంటున్నారా? కచ్చితంగా మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ఎవరైనా ఇలానే అనుకుంటారు? కానీ పర్టిక్యులర్‌గా ఫస్ట్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమే కదా. అందులోనూ అకీరా ఆ సినిమా చూశాక తొలుత ఫోన్‌ చేసింది ఆ సినిమా సినిమాటోగ్రాఫర్‌ రవి.కె.చంద్రన్‌కి. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు మరి.

Akira

‘ఓజీ’ సినిమాకు సంబంధించి ముఖ్యంగా క్రెడిట్‌ ఇవ్వాల్సింది దర్శకుడు సుజీత్‌, సంగీత దర్శకుడు తమన్‌కే. సగటు ప్రేక్షకులే కాదు.. హీరో పవన్‌ కల్యాణ్‌ కూడా ఇదే మాట అంటున్నారు. వారి తర్వాత ఆ స్థాయిలో సినిమా కోసం కష్టపడింది.. సినిమా ఇలా రావడానికి కారణమైంది ఎవరు అంటే.. సినిమాటోగ్రాఫర్‌ రవి.కె.చంద్రన్‌. ఆయన విజువల్స్‌, కలరింగ్‌, కెమెరా పానింగ్‌ లాంటి వల్ల ప్రేక్షకులకు సినిమా ఇంకాస్త హై ఇచ్చింది అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో పవన్‌ని ఆయన ఇంకా స్టైలిష్‌గా చూపించారనే ప్రశంసలూ వినిపిస్తున్నాయి.

సినిమా ప్రీమియర్‌ షో చూశాక అకీరా నందన్‌.. రవి కె చంద్రన్‌కి ఫోన్‌ చేసి ఇదే విషయం చెప్పారట. ‘మా నాన్నని చాలా బాగా చూపించారు. స్టైలిష్‌గా కనిపించారు’ అంటూ రవి కె చంద్రన్‌కు శుభాకాంక్షలు చెప్పాడట అకీరా. తన మాటలు చాలా తృప్తినిచ్చాయని ఆయన తెలిపారు. సగటు ప్రేక్షకులు, అభిమాని మాటే అకీరా చెప్పాడు అని చెప్పొచ్చు. ఇక పవన్‌ స్టైల్‌ గురించి రవి కె చంద్రన్‌ మాట్లాడుతూ పవన్‌ మామూలుగా నడిచొస్తుంటేనే ఓ ప్రత్యేకమైన స్టైల్‌ కనిపిస్తుంది. ‘భీమ్లా నాయక్‌’ సినిమాలోనూ మనం ఇది చూడొచ్చు అని అన్నారు.

ఆ సినిమాలో పవన్‌ లుంగీతో ఎక్కువగా కనిపిస్తారు. ఆయన జుట్టు గాలికి ఎగిరిపడటం, మేనరిజమ్స్‌ మీద అవగాహన ఉండటంతో ‘ఓజీ’ సినిమా ప్రయాణం సులభమైంది అని రవి కె చంద్రన్‌ తెలిపారు.

బాలయ్య.. గోపీచంద్ మలినేని కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus