నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి‘ అనే సినిమా వచ్చింది. అది కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో బాలకృష్ణని గోపీచంద్ మలినేని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. అభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. అందుకే గోపీచంద్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ‘అఖండ 2’ త్వరలో రిలీజ్ కాబోతుంది. అది బాలయ్య కెరీర్లో 110 వ సినిమా.
అయితే 111వ సినిమా ఏంటనేది ఇప్పటివరకు అభిమానులకు క్లారిటీ రాలేదు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని చాలా కాలం నుండి ప్రచారం జరుగుతుంది. స్క్రిప్ట్ కూడా లాక్ చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారంటూ ప్రచారం జరిగింది. బాలయ్య పుట్టిన రోజునే ప్రారంభం కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. తర్వాత వెంకట్ సతీష్ కిలారు ఈ ప్రాజెక్టుని టేకప్ చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 24న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా గోపీచంద్ మలినేని సినిమాలకు తమన్ సంగీతం అందిస్తూ ఉంటారు. అయితే ఈసారి సంగీత దర్శకుడిని మార్చేస్తున్నట్టు టాక్ వినిపించింది. కానీ గోపీచంద్ మాత్రం తమన్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. బాలయ్య సినిమాలకు తమన్ బెస్ట్ ఔట్పుట్ ఇస్తుంటారు. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘డాకు మహారాజ్’ సినిమాలకు తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అందుకే నిర్మాత నో చెప్పినా పట్టుబట్టి మరీ తమన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.