అకీరా నందన్ హీరో ఎన్టీఆర్ కి మంచి అభిమానంట

  • June 27, 2018 / 09:52 AM IST

మహేష్ బాబు, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం వాళ్ళిద్దరూ కలిసి న్యూయార్క్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చేవరకూ ఎవరికీ తెలియలేదు. అలాగే.. ఎన్టీఆర్-మహేష్ మంచి దోస్తులన్న విషయం కూడా “భరత్ అనే నేను” ఆడియో విడుదల వరకూ కూడా ఎవరికీ అర్ధం కాలేదు. ఇక ఆ తర్వాత నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రెగ్యులర్ గా ఏదో ఒక ఈవెంట్ లో కలవడం, ఆ సందర్భంగా కొన్ని ఫోటోలు ఆన్ లైన్ లో పెట్టడంతో ఈ ముగ్గురి హీరోల ఫ్రెండ్ షిప్ అందరికీ అర్ధమైంది. అలా తాజాగా తెలిసి అందరూ షాక్ అయిన విషయం ఏంటంటే..

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కి మన జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇటీవల తన సన్నిహితులతో చెప్పాడట. తన కొడుకు ఎన్టీఆర్ సినిమాల్ని రెగ్యులర్ గా చూస్తాడని, తెలుగు పూర్తిగా అర్ధం కాకపోయినా హిందీ డబ్బింగ్ సినిమాలు చూస్తాడని పవన్ కళ్యాణ్ పేర్కొనడం విశేషం. స్వయంగా పవన్ కళ్యాణ్ ఇలా తన కొడుకు ఎన్టీఆర్ ఫ్యాన్ అని, అతడి సినిమాలన్నీ చూస్తాడని చెప్పడంతో నందమూరి అభిమానులు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో మునిగితేలుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus