Akira Nandan: అకీరా నందన్‌ ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసా!

అకీరా నందన్‌… ఈ లిటిల్‌ పవర్‌ స్టార్‌ గురించి చాలాతక్కువే మనకు తెలుసు. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ ఫొటోల్లో కనిపించడం, మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తున్న వీడియోలు అప్పుడప్పుడు బయటికొచ్చాయి. తల్లి రేణు దేశాయ్‌ అప్పుడప్పు అకీరా గురించి, అతని ఇష్టాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ ఉంటారు. అయితే అకీరా గ్రాడ్యుయేషన్‌ డే వల్ల అతని ఇష్టాయిష్టాలు, టాలెంట్‌లు బయటికొచ్చాయి. అవేంటో ఓసారి చూద్దాం. తండ్రి పవన్‌కి, అతనికి ఉన్న సారూపత్యలు కూడా ఓసారి చూసేద్దాం.

అకీరాకి మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. ఈ విషయం మనకు ఇప్పటికే తెలుసు. యుద్ధ విద్యలు ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలు ఇప్పటికే మనం చాలాసార్లు చూశాం. ఇది కాకుండా చూస్తే అకీరాకు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టమట. పియానో వాయిస్తాడు. అందులో శిక్షణ కూడా తీసుకున్నాడు అకీరా. మ్యూజికల్‌ కంపోజిషన్స్‌ చేస్తూ ఉంటాడు. అలాగే హిట్‌ పాటలు, సొంత పాటలతో పియానో కవర్‌ సాంగ్స్‌ చేస్తుంటాడట. దీంతోపాటు జంతువులు అన్నా చాలా ఇష్టమట. స్ట్రీట్‌ యానిమల్స్‌ విషయంలో ప్రేమను పంచుతుంటాడట.

గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా తన బ్యాచ్‌మేట్స్‌కి అకీరా తనకు ఎంతో ఇష్టమైన పియానో వాయించి ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా నుండి ‘దోస్తీ’ పాటను డెడికేట్‌ చేశాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘దోస్తీ’ పాటను నా బ్యాచ్‌కు డెడికేట్‌ చేస్తున్నా అంటూ పాట పియానో వెర్షన్‌ను వాయించాడు అకీరా. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

లైక్‌ ఫాదర్‌ లైక్‌ సన్‌ అంటూ ఆ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. పవన్‌ కల్యాణ్‌కు కూడా మార్షల్‌ ఆర్ట్స్‌, జంతువులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అకీరా నుండి అలాంటిదే చూస్తున్నాం. అయితే అకీరా సినిమాల్లోకి రాడు అంటూ ఇటీవల రేణు దేశాయ్‌ ప్రకటించారు. కానీ అంతర్గతంగా అకీరా సినిమాల ఎంట్రీ పనులు సాగుతున్నాయని టాక్‌. చదువు పూర్తయ్యాక సినిమా సంగతులు బయటికొస్తాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్‌ అయిపోయింది. ఇంకా అకీరా ఏం చేస్తాడో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus