Kannappa: కన్నప్పలో ప్రభాస్.. అక్షయ్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారా?

మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప (Kannappa) సినిమా ఇటీవల టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. డిఫరెంట్ స్టార్ క్యాస్ట్ తో వస్తున్న ఈ పౌరాణిక చిత్రం, కన్నప్ప అనే శివ భక్తుడి గాథను అద్భుతంగా చూపించనుందని టీజర్‌ చూస్తేనే అర్థమవుతోంది. భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి అనేక మంది ప్రముఖులు గెస్ట్ రోల్స్‌ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్ర‌భాస్‌ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar)  కీలక పాత్రల్లో నటిస్తుండటంతో, ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Kannappa

టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో నార్త్ నుంచి సౌత్ వరకు అందరి ఫోకస్ ప్రభాస్ క్యారెక్టర్‌పైనే ఉంది. అతని శివుడి లుక్, ప్రెజెన్స్ గూస్‌బంప్స్ తెప్పించిందని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అదే సమయంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఏమిటంటే, టీజర్‌లో ప్రభాస్ లుక్‌కు వచ్చిన రెస్పాన్స్, అక్షయ్ పాత్రకు మాత్రం రాలేదు. బాలీవుడ్‌లో అక్షయ్‌కు భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, కన్నప్ప టీజర్‌లో ఆయన లుక్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా, అక్షయ్ నటించిన ఓ మై గాడ్ 2 (OMG 2) సినిమాలోనూ శివుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ అతని క్యారెక్టర్‌ని ప్రామాణికంగా డిజైన్ చేయగా, ఇక్కడ మాత్రం ఆయన లుక్ పై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. హావభావాలు పూర్తిగా కన్విన్సింగ్‌గా అనిపించకపోవడం బాలీవుడ్ నెటిజన్లను కాస్త నిరాశపరుస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, టీజర్ అంతా ప్రభాస్ క్యారెక్టర్‌పైనే హైప్ రావడంతో, అక్షయ్ పాత్ర కాస్త డల్‌గా కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.

దీనిపై అక్షయ్ ఫ్యాన్స్ తమ అసంతృప్తిని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి సినిమా విడుదలయ్యాకే అసలు విషయం తేలుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్ హైప్, ప్రభాస్ క్యారెక్టర్‌పై వచ్చిన వావ్ ఫ్యాక్టర్ చూసుకుంటే, సినిమా విడుదలయ్యే వరకు హైప్ కొనసాగే అవకాశముంది. ఇక అసలు సినిమాలో అక్షయ్ పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందనేది కన్నప్ప విడుదలయ్యే వరకు ఆసక్తికరమైన డిబేట్‌గానే మారేలా ఉంది.

 సినిమా ప్రచారంలో కొత్త స్టయిల్‌.. కిరణ్‌ అబ్బవరం స్పెషల్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus