Dilruba: సినిమా ప్రచారంలో కొత్త స్టయిల్‌.. కిరణ్‌ అబ్బవరం స్పెషల్‌!

మా సినిమా చూడండి గిఫ్ట్‌లు గెలుచుకోండి. మా సినిమా టికెట్‌ లక్కీడిప్‌ బాక్సులో వేయండి డ్రా తీసి గిఫ్ట్‌లు ఇస్తాం. ఇలాంటి ప్రచారాలు ఇప్పటి సినిమా ప్రేక్షకుల తరానికి కొత్తేమో కానీ.. కొన్నేళ్ల క్రితం ఇలాంటివి చాలా జరిగాయి. అయితే ఓల్డ్‌ మళ్లీ రిపీట్‌ అవుతుంది అని అంటారు కదా. అలా ఇప్పుడు ఈ గిఫ్ట్‌లు ట్రెండ్‌ మళ్లీ వచ్చింది. మొన్నీమధ్యనే రెండు సినిమాలు ఇలా గిఫ్ట్‌ల కాన్సెప్ట్‌ పెట్టగా.. ఇప్పుడు ‘మా చిత్ర కథ చెప్పండి.. బైక్‌ గెలుచుకోండి’ అని కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) అంటున్నాడు.

Dilruba

కిరణ్‌ అబ్బవరం, రుక్సర్‌ థిల్లాన్‌  (Rukshar Dhillon) జంటగా నటించిన సినిమా ‘దిల్‌ రూబా’ (Dilruba). విశ్వ కరుణ్‌ (Vishwa Karun) ..తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారం కోసం సినిమా టీమ్‌ ఓ ఆలోచన చ,ఏసింది. సినిమా కథే ఏంటో ఊహించి చెబితే.. సినిమాలో హీరో వాడిన బైక్‌ను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా హీరో కిరణ్‌ అబ్బవరమే ఈ ఆఫర్‌ ప్రకటించాడు.

దీంతో మరోసారి టాలీవుడ్‌లో గిఫ్ట్‌ల సంస్కృతి జోరుగా మొదలైంది అని చెప్పాలి. పైన చెప్పినట్లు సినిమా చూసినవాళ్లకు లక్కీ డిప్‌ పెట్టి ప్రైజ్‌లు ఇస్తామని ఓ సినిమా టీమ్‌ చెప్పింది. ఇంకో సినిమా ఏమో సినిమాలో విలన్‌ ఎవరో చెబితే ప్రైజ్‌ ఇస్తామని చెప్పింది. సాయిరామ్‌ శంకర్‌ (Sairam Shankar) కథానాయకుడిగా నటించిన ‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaaram) సినిమా ఫిబ్రవరి 7న వచ్చింది. సినిమా తొలి రోజు తొలి ఆట ఫస్టాఫ్‌ చూసి విలన్‌ ఎవరో కనిపెడితే రూ. 10 వేలు బహుమానం ఇస్తామని టీమ్‌ చెప్పింది. మొత్తం 50 థియేటర్లలో ఈ పోటీ ఉంటుందట.

అక్షయ్, మమితా బైజు (Mamitha Baiju), ఐశ్వర్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ‘డియర్‌ కృష్ణ’ సినిమా టీమ్‌ కూడా ఓ ప్రయత్నం చేస్తోంది. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెగే మొదటి వంద టికెట్లలో ఓ టికెట్‌ని లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసి, ఆ ప్రేక్షకుడికి రూ.10 వేలు బహుమానం ఇస్తామని చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus