30 రోజులు పూర్తయినప్పటికీ ‘అల వైకుంఠపురములో’ స్పీడ్ ఏమాత్రం తగ్గట్లేదు. కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. మార్నింగ్ షోలు, మ్యాట్నీ లు కాస్త డల్ గా ఉంటున్నప్పటికీ.. ఈవెనింగ్ షోల నుండీ మళ్ళీ పుంజుకుంటూనే వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రం 252 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేసింది.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 30 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 44.17 cr |
సీడెడ్ | 18.09 cr |
ఉత్తరాంధ్ర | 19.66 cr |
ఈస్ట్ | 11.29 cr |
వెస్ట్ | 8.85 cr |
కృష్ణా | 10.65 cr |
గుంటూరు | 11.02 cr |
నెల్లూరు | 4.65 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.79 cr |
ఓవర్సీస్ | 18.31 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 158.48 cr (share) |
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 30 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…128.38 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక.. వరల్డ్ వైడ్ గా మొత్తం ..158.48 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 253.37 కోట్లను కొల్లగొట్టింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైందో చూడాలి.
Click Here For Ala Vaikunthapurramloo Movie Review
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!