‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ ఫేక్ అంటే ఎలా..!

  • January 23, 2020 / 04:16 PM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘సరైనోడు’ చిత్రం తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న బన్నీ కి .. ‘అల వైకుంఠపురములో’ అంతకు మించిన హిట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ‘ఈ చిత్రం కలెక్షన్లు ఫేక్ అని.. బన్నీ సినిమాకి అంత సీన్ లేదని’ సోషల్ మీడియాలోనూ .. ఫిలింనగర్లోనూ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

అయితే సినిమా కలెక్షన్స్ అనేవి హీరో రేంజ్ ను బట్టే డిసైడ్ అయ్యి ఉంటాయి అనడం అస్సలు కరెక్ట్ కాదు. ప్రేక్షకులు ఆదరించడం బట్టి ఉంటుంది అనేది అసలు సత్యం. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. ప్రేక్షకులను మేప్పిస్తేనే ఆడుతుంది. సంక్రాంతికి మొదటగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు తరువాత కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఆడతాయి అనడంలో సందేహం లేదు. ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ‘అల వైకుంఠపురములో’ టీం మొదటి నుండీ ఈ విషయం పైనే ఫోకస్ పెట్టారు. ముందుగా ఆడియోని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హమ్ చేసేలా చూసుకున్నారు. హీరో కోడి పుంజుని పట్టుకుని వస్తున్న పోస్టర్ సంక్రాంతి ఫీలింగ్ ను కరెక్ట్ గా ప్రెజెంట్ చేసింది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ అందుకు తగ్గ డైలాగ్ లు కరెక్ట్ గా నింపడంలో దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. ఓవర్సీస్ ఆడియన్స్ కు కూడా ఇవే కావాలి. అందుకే ‘అల వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఇక నిర్మాతలు కూడా ఎక్కువ థియేటర్స్ వచ్చేలా చూసుకున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం హౌస్ ఫుల్స్ ను సాధిస్తుంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 134 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది ట్రేడ్ వర్గాల సమాచారం. వీటిని ఫేక్ అని అనడం ఎంత మాత్రం సబబు కాదనే చెప్పాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus