‘అల వైకుంఠపురములో’ 6 డేస్ కలెక్షన్స్..!

  • January 18, 2020 / 08:11 PM IST

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠ పురములో’. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రం సూపర్ ఫాస్ట్ గా నడిచినప్పటికీ … సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ రొటీన్ టెంప్లేట్ అండ్ స్లో నెరేషన్ తో కాస్త విసిగించినా క్లయిమాక్స్ మాత్రం ఓకే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కలెక్షన్ లు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రాలకు కూడా సాధ్యం కాని కలెక్షన్లు ఈ చిత్రానికి వస్తుండటం విశేషం. మొన్నటి వరకూ ఈ చిత్రం టార్గెట్ ‘రంగస్థలం’ రికార్డులు అనుకుంటే… ఇప్పుడు ‘బాహుబలి1’ కే ఎసరు పెట్టింది.

ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 25.35 cr
సీడెడ్ 12.77 cr
ఉత్తరాంధ్ర 11.65 cr
ఈస్ట్ 6.88 cr
వెస్ట్  5.71 cr
కృష్ణా 6.96 cr
గుంటూరు 7.49 cr
నెల్లూరు 2.93 cr
ఏపీ+తెలంగాణ 79.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.54 cr
ఓవర్సీస్  10.48 cr
వరల్డ్ వైడ్ టోటల్  98.76 cr (share)

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 6 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…79.74 కోట్ల షేర్ ను … కలెక్ట్ చేసింది.ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..98.76 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 159 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ‘రంగస్థలం’ కలెక్షన్ లనే కాదు ‘బాహుబలి 1’ కలెక్షన్ లను కూడా అదిగమించడం ఖాయంగా కనిపిస్తుంది.

Click Here To Ala Vaikunthapurramloo Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus