అలీ రేజా స్పెషల్ సర్ ప్రైజ్..!
- September 26, 2019 / 11:07 PM ISTByFilmy Focus
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. దీంతో షో కాస్త డల్ అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొకరిని హౌస్ లోకి పంపిస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అదే ప్లాన్ లో ఉన్నారు. గత సీజన్లో ‘శ్యామల’ ‘నూతన్ నాయుడు’ వంటి ఇద్దరు ముందుగా ఎలిమినేట్ అయిన వారిని వైల్డ్ కార్డు ద్వారా తిరిగి హౌస్ లోకి పంపించారు. అయితే ఈ సీజన్లో కూడా అలీ రెజా ని హౌస్ లోకి తిరిగి ఇంటిలోకి తీసుకొచ్చారు.

ముందు నుండే అలీ ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని.. కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని… ప్రేక్షకులు ముందుగా అనుకున్నారు. కానీ సడన్ గా అలీ ఎలిమినేట్ అవ్వడంతో నిరాశ చెందారు. ఇప్పుడు అలీ హౌస్ లోకి వొచ్చేసరికి ప్రేక్షకులు కూడా ఫుల్ హ్యాపీ ఉన్నారు.
1

2

3

4

5

6

7

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















