ప్రభాస్ తో నటించడానికి సై చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!

  • May 15, 2017 / 12:09 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే ఏ బ్యూటీ వదులుకోదు. ఈ విషయాన్నీ బాలీవుడ్ నటి అలియా బట్ సోషల్ మీడియాలో మొహమాటం లేకుండా ఒప్పుకుంది. దక్షిణాది నటుల్లో ప్రభాస్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అతనితో పనిచేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం డ్రాగన్‌, గల్లీ బాయ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్న ఆలియా అభిమానులతో ట్విట్టర్ వేదికపై ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది.

‘బాహుబలి 2’ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘ఈ భారీ విజయానికి మరో పేరు కావాలా? ఇదో రాక్‌ బస్టర్‌ చిత్రం. నాకు చాలా నచ్చింది’ అని ఆలియా సమాధానమిచ్చింది. ప్రభాస్ బాహుబలి తర్వాత సినిమా సాహో కోసం డైరక్టర్ సుజీత్ హీరోయిన్ల వేటలో ఉన్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బ్యూటీని వెతకడం కష్టమయిపోయింది. ఈ సమయంలో ఆలియా బట్ మాటలు టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాయి. మరి సాహో చిత్ర బృందం ఆమెను పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus