Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

సోషల్‌ మీడియా మనుషుల జీవితాల్లో ఎంతలా భాగమైపోయిందో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఉదయాన్నే లేవగానే ఏదో ఒక సోషల్‌ మీడియా యాప్‌ ఓపెన్‌ చేయడం.. స్క్రోల్‌ చేసుకుంటూ గంటల తరబడి మునిగిపోవడం చూస్తున్నాం. దీని గురించి ప్రముఖ కథానాయిక ఆలియా భట్‌ ఇటీవల మాట్లాడింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్లు కూడా చేసింది. వాటి వినియోగం విషయంలో ఎంత కఠినంగా ఉండాలనుకున్నా ఆపలేకపోతున్నా అని తన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చింది.

Alia Bhatt

ఈ వృత్తిలో ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియా ఒత్తిడి ఉంటుంది. ఒక్కోసారి నిద్ర లేవగానే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి అనిపిస్తుంది. నటనపై మాత్రమే దృష్టి పెట్టి నటిగా మాత్రమే ఉండాలని అనుకుంటాను. కానీ అలా చేస్తే నా కెరీర్‌ ప్రారంభం నుండి నన్ను ప్రోత్సహించిన ఎంతో మంది అభిమానులతో సంబంధాలు తెగిపోతాయి. అందుకే ఆ పని చేయలేకపోతున్నాను అని చెప్పింది ఆలియా. ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉండటమనేది నా వృత్తిలో భాగమైపోయిందని చెప్పుకొచ్చింది ఆలియా.

అయితే తల్లి అయిన తర్వాత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే విషయాల వల్ల కొన్ని పరిమితులు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం బాగా పర్సనల్‌ అయిపోయింది అని సోషల్‌ మీడియాలో ఇటీవల తక్కువగా కనిపించడం గురించి చెప్పుకొచ్చింది. ఇక తన పెళ్లికి సంబంధించిన మీమ్స్ చూసి నేను, భర్త (రణ్‌బీర్‌) చూసి నవ్వుకుంటామని చెప్పింది. చాలా వరకు ఇలాంటి విషయాలు పట్టించుకోమని.. పట్టించుకున్నా అది నవ్వుకోవడం వరకే ఉండిపోతుందని చెప్పుకొచ్చింది ఆలియా.

‘డార్లింగ్స్‌’ సినిమాతో నిర్మాతగా మారిన ఆలియా.. ఆ రోల్‌ గురించి చెబుతూ చిత్ర నిర్మాణం ఎన్నో విషయాలను నేర్పింది. నా పాత్రను మాత్రమే కాకుండా స్క్రిప్ట్‌ మొత్తం చూడటం, ప్రతి పాత్ర కోణంలో సినిమాను ఊహించడం, షూటింగ్‌ను పూర్తి చేయడంలో పడే కష్టం తెలిసింది. దీంతో నిర్మాతల విషయంలో గౌరవం పెరిగింది అని చెప్పుకొచ్చింది.

రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus