Alia Bhatt, Suma: రాజమౌళితో గిల్లించుకున్న సుమ.. నిజమే అంటూ సందడి చేసిన సుమక్క!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే బాలీవుడ్ సినిమాలు మాత్రమే అని చెప్పుకునే స్థాయిలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఉండేది. అప్పట్లో తెలుగు సినిమాలను పట్టించుకునే వారి లేరని చెప్పాలి.అయితే రాజమౌళి ఎప్పుడైతే బాహుబలి సినిమాని చేశారు ఒక్కసారిగా సినీ ప్రపంచం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూసింది.అప్పటినుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాయి.

ఒకప్పుడు తెలుగు సినిమాలంటేనే చులకనగా చూసే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో సందడి చేసే పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి సైతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా చిత్రబృందం సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇలా బాలీవుడ్ నటీనటులు సుమ క్యాష్ కార్యక్రమానికి రావడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్ నటీనటులు రణబీర్ కపూర్ అలియా భట్, మౌని రాయ్, ఎస్ ఎస్ రాజమౌళి ఈ కార్యక్రమంలో సందడి చేశారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా సుమ వేదిక పైకి రణబీర్ కపూర్ అలియా భట్ ను ఆహ్వానించి వారికి బొకే అందించారు. ఇక రాజమౌళిని వేదిక పైకి ఆహ్వానిస్తూ ఫ్లాప్ అంటేనే తన దరికి చేరదని ప్లాపులనే ఫ్లాప్ చేసిన డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గారు అంటూ ఆయనని వేదికపైకి ఆహ్వానించారు.అయితే నిత్యం జబర్దస్త్ కమెడియన్స్ ఇతర నటీనటులతో సందడి చేసే సుమ ఈసారి ఏకంగా రాజమౌళి, బాలీవుడ్ నటులతో క్యాష్ కార్యక్రమంలో సందడి చేయడంతో ఇది కల నిజమా అనే ఊహల్లోనే తేలిపోయింది. ఈ క్రమంలోనే రాజమౌళి గారి వద్దకు వెళ్లి రాజమౌళి గారు ఒకసారి గిల్లండి అంటూ అడిగి మరీ గిల్లించుకొని ఇది నిజమే మీరు క్యాష్ కార్యక్రమంలోనే ఉన్నారనీ సుమ అనగా ఇలా సుమ చేసిన ఈ పనికి అలియా భట్ ఏకంగా తలకు కొట్టుకొని నవ్వారు. మొత్తానికి ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus