Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

సాయి దుర్గ తేజ్(సాయి ధరమ్ తేజ్) ఒకప్పటితో పోలిస్తే స్పీడ్ బాగా తగ్గించాడు. 3 ఏళ్ళ క్రితం అతను యాక్సిడెంట్ పాలవ్వడంతో బెడ్ కే పరిమితం అవ్వడం, తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టడం జరిగింది. అదే టైంలో ‘రిపబ్లిక్’ అనే సినిమా వచ్చి వెళ్ళింది. ఆ సంగతి తేజుకి కూడా తెలిసుండకపోవచ్చు. అయితే తర్వాత చేసిన ‘విరూపాక్ష‌’ బ్లాక్ బస్టర్ అయ్యింది. తేజుని వంద కోట్ల క్లబ్లో చేర్చింది ఆ సినిమా. తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ చేశాడు.

Sai Dharam Tej

అది అంతగా ఆడలేదు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో తేజుకి ఎక్కువ క్రెడిట్ లభించలేదు. అయినప్పటికీ ‘సంబ‌రాల ఏటి గ‌ట్టు’ అనే భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు తేజు. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు ‘హనుమాన్’ నిర్మాత నిరంజ‌న్ రెడ్డి రంగంలోకి దిగారు. రోహిత్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే దర్శకుడికి ఇది తొలి సినిమా కావడం వల్ల.. బడ్జెట్ లెక్కలు ఇంకా పెరిగిపోయాయట. దీంతో ప్రాజెక్టుకి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని రోజులు షూటింగ్ కూడా ఆగిపోయింది. మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారు అని వినికిడి. మొత్తానికి ఇటీవల మళ్ళీ షూటింగ్ మొదలైంది. ఓ గ్లిమ్ప్స్ కూడా సాయి ధరమ్ తేజ్ బర్త్ డే కానుకగా వదిలారు. వాస్తవానికి సెప్టెంబర్ 25 నే ‘సంబరాల యేటి గట్టు’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే అవ్వడంతో వెనక్కి వెళ్ళింది. 2026 సమ్మర్ వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే.

‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus