Chiranjeevi: ‘విశ్వంభర’ ప్రపంచం సిద్ధం… కొత్త షెడ్యూల్‌ ఎప్పటి నుండంటే?

  • January 20, 2024 / 02:48 PM IST

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. ఈ సినిమా చూసినప్పుడల్లా చిరంజీవి ఫ్యాన్స్‌కు అనిపించే మాట… ‘మరోసారి బాస్‌ని ఇలా చూడాలి, ఇలాంటి కథలో చిరు నటించాలి’ అని. ఎందుకంటే ఆ సినిమాలో చిరు లుక్స్‌, యాక్షన్‌, కంటెంట్‌, కటౌట్ అన్నీ అదిరిపోతాయి. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు వరకు ఆ ఛాన్స్‌ రాలేదు. అయితే ఇప్పుడు ‘విశ్వంభర’ రూపంలో ఆ అవకాశం దక్కుతోంది. చిరంజీవిని ‘జగదేక వీరుడు’లా చూపించడానికి వశిష్ట ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజానికి ‘విశ్వంభర’ సినిమా ప్రారంభమై చాలా రోజులు అయ్యింది. ఓ షెడ్యూల్ షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. అయితే అందులో చిరంజీవి పాల్గొనలేదు. దీంతో చిరు షూటింగ్‌ ఎప్పుడు అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ క్రమంలో సినిమా టీమ్‌ నుండి ఆసక్తికర సమాచారం వచ్చింది. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఎ.ఎస్‌.ప్రకాశ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారట.

అంతేకాదు ఆ సెట్స్‌లో చిరంజీవి వచ్చే నెల తొలి వారంలో అడుగుపెడతారట. చిరు సరసన ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఆ విషయంలో కూడా వచ్చే నెలలోనే క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. తొలి షెడ్యూల్‌లోనే హీరోయిన్‌తో సీన్స్‌ చిత్రీకరిస్తారని చెబుతున్నారు. అలా ‘విశ్వంభర’ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. దీనికి సంబంధించి ఓ గ్లింప్స్‌ రావొచ్చని సమాచారం.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే (Chiranjeevi) చిరంజీవి 157వ సినిమాగా రావాల్సిన ఈ చిత్రం అనూహ్య మార్పుల తర్వాత 156వ సినిమాగా మారింది. రామ్‌చరణ్‌తో సినిమా చేద్దామని అనుకున్న యూవీ క్రియేషన్స్‌ చిరంజీవితో సినిమా చేస్తోంది. ఇక కల్యాణ్‌రామ్‌తో ‘బింబిసార 2’ చేయాల్సిన వశిష్ట మల్లిడి ఈ సినిమా చేస్తున్నారు. ఫైనల్‌గా వరుస వాయిదాల తర్వాత సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుంది అంటున్నారు. అంతేకాదు ఈ లాంగ్‌ షెడ్యూల్‌ అని టాక్‌.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus