Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్ కూడా రెడీ… ప్రభాస్ డేట్స్ ఇచ్చాడా?
- February 21, 2026 / 07:21 PM ISTByFilmy Focus Desk
ఎప్పుడు అనే మాట చెప్పడం లేదు.. అలా అని ఇప్పుడు కాదు అనే మాట కూడా చెప్పడం లేదు.. ఇదిగో, అదిగో అని మాత్రం చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆ స్టార్ హీరో సినిమా సీక్వెల్ గురించి ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ఏ మాట నమ్మాలో, ఏ మాట నమ్మకూడదో అర్థం కాక.. మొదలైనప్పుడు చూద్దాంలే అని ఆ హీరో ఫ్యాన్స్ కామ్ అయిపోయారు. ఇలాంటి సమయంలో తాజాగా మరోసారి ఇదిగో, అదిగో అంటూ సినిమా షూటింగ్ ప్రారంభించే డేట్ గురించి రూమర్లు వచ్చాయి. ఆ సినిమానే ‘కల్కి 2’.
Kalki 2
‘కల్కి 2898 ఏడీ’ సినిమా వచ్చి 20 నెలలు అయిపోతోంది. ఆ సినిమా ఎండ్ కార్డ్స్‌లో ‘కల్కి 2’ అని వేసి సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు నాగీ అలియాస్ నాగ్ అశ్విన్ ఆ తర్వాత ఎక్కడా ఆ సినిమా గురించి మాట్లాడలేదు. నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నా దత్ మాత్రం సినిమా గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ పెద్ద సెట్ వేశారు అనే టాక్‌ని బయటకు పంపించారు. నగర శివారులో ఆ సెట్ ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.

ఇక్కడో మేటర్ ఏంటంటే.. ఆ సెట్‌లో ఈ రోజు నుండి సినిమా షూటింగ్ మొదలైంది అని చెబుతున్నారు . నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేయడం, శంకర్ పల్లిలోని ఓ స్టూడియోలో గత కొన్ని నెలలుగా వేస్తున్న దేశంలోనే అతిపెద్ద సెట్స్‌లో ఒకటి పూర్తవ్వడంతో షూటింగ్ ప్రారంభించేస్తున్నారు అని టాక్. దీని కోసం అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ వచ్చారట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ కోసం ప్రభాస్ 10 రోజుల డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. చూద్దాం రెగ్యులర్ ప్రభాస్ సినిమాల సెట్స్ నుండి లీకులు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడేమైనా వస్తాయేమో.
విశ్వక్.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?















