కళ్యాణ్ రామ్- బాలకృష్ణ ల మల్టీ స్టారర్ ఫిక్సట..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ’ అనే ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాకి భయపడకుండా బాలయ్య ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇది పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని లేదా అనిల్ రావిపూడి వంటి అగ్ర దర్శకులతో బాలయ్య తన తదుపరి సినిమాని మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. అయితే వీరిలో మొదట ఏ దర్శకుడితో బాలయ్య సినిమా పట్టాలెక్కుతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ..

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చెయ్యబోతున్న సినిమా మాత్రం మల్టీస్టారర్ గా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్యతో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే మరో హీరో ఎవరా అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో మొదలయ్యే ఉంటుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య తో కలిసి నటించే హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయట.

అంతేకాదు తారక్ కూడా ఈ చిత్రంలో కొద్దిసేపు కనిపించే అవకాశాలు ఉన్నాయని వినికిడి. ఇది కనుక నిజమే అయితే.. ఇది నందమూరి ‘మనం’ అయినట్టే..! ఇక అనిల్ రావిపూడిని డైరెక్టర్ గా పరిచయం చేసింది కళ్యాణ్ రామ్ అన్న సంగతి తెలిసిందే. ‘షైన్ స్క్రీన్స్’ వారు నిర్మించే ఈ చిత్రానికి అతను కూడా సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందట.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus